హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడికి ఘన సన్మానం

అన్నమయ్య: పీలేరు మండలం కే.వీ.పల్లి మండలం సిబ్బాలవాండ్లపల్లి ఎంపీపీఎస్‌లో పనిచేస్తున్న రావూరి సుబ్రహ్మణ్యం జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడిగా కలెక్టర్ చేతులమీదుగా అవార్డు అందుకున్నారు. ఈ సందర్భంగా పీలేరు ఆపస్ కార్యాలయంలో జిల్లా సహాధ్యక్షుడు పచ్చార్ల సుధాకర్ ఆధ్వర్యంలో ఆదివారం ఆయనను ఘనంగా సన్మానించారు.