డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా పి. గన్నవరం మండలం గంటి పెదపూడిలో శ్రీలక్ష్మీ ఆది గణపతి స్వామి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా విద్యార్థులు స్వామివారికి పెన్నుల పూజ నిర్వహించారు. అనంతరం లక్ష గరిక పూజతో పాటు శ్రీలక్ష్మీ ఆది గణపతి స్వామివారికి తొమ్మిది రకాల అభిషేకాలు నిర్వహించారు. భక్తులు, విద్యార్థులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.
ఆంధ్రప్రదేశ్
విద్యార్థుల చేత గణపతికి పెన్నుల పూజ


