హైదరాబాద్: 28°C
తెలంగాణ

గణపతి మండపాల వద్ద ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు

JN: జనగామ పట్టణంలోని పలు వార్డుల్లో ఏర్పాటు చేసిన గణపతి మండపాలను ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఆదివారం సందర్శించారు. మండపాల్లో కొలువుదీరిన గణనాథుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.గణపతి నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని ఆయన ఆకాంక్షించారు.భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని గణనాథుడి ఆశీస్సులు పొందాలని కోరారు.