కాకినాడ వేదికగా ఈ నెల 22న జనసేన స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహక సమావేశం జరగనుంది. పార్టీ అధ్యక్షుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు, 25 పార్లమెంటరీ నియోజకవర్గాల సమన్వయకర్తలు, కమిటీ సభ్యులు హాజరుకానున్నారు. ఎన్నికల సన్నద్ధత, కూటమి సమన్వయంపై చర్చించనున్నారు.
ఆంధ్రప్రదేశ్
22న జనసేన సన్నాహక సమావేశం


