హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తంటికొండ ఆలయానికి నిధులు మంజూరు

E.G: తంటికొండ వెంకటేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణానికి టీటీడీ రూ. 6 కోట్లు మంజూరు చేసింది. మ్యాచింగ్ గ్రాంట్‌లో భాగంగా దాసరి సీతారామకృష్ణ రూ. 30 లక్షలు విరాళంగా అందించారు. తిరుమలలో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ చేతుల మీదుగా విరాళాన్ని టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్రకు అందజేశారు. ఆలయ అభివృద్ధికి నిధులు మంజూరు కావడంతో భక్తులు హర్షం వ్యక్తం చేశారు.