హైదరాబాద్: 28°C
తెలంగాణ

పల్లె ప్రకృతి వనం నిర్వహణ లేక నిరుపయోగం

WNP: పెద్దమందడి మండలం బలిజపల్లిలో రూ.లక్షల వ్యయంతో నిర్మించిన పల్లె ప్రకృతి వనం నిర్వహణ లేక నిరుపయోగంగా మారింది. మొక్కల సంరక్షణపై సిబ్బంది పర్యవేక్షణ కొరవడిందని గ్రామస్థులు పేర్కొంటున్నారు. పరిసరాలు అపరిశుభ్రంగా మారడంతో పాటు పిచ్చి మొక్కలు దట్టంగా పెరిగాయి. పచ్చదనం పెంపు, ప్రజలకు ఆహ్లాదం కల్పించాలనే లక్ష్యం నెరవేరడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.