హైదరాబాద్: 28°C
తెలంగాణ

విశ్వకర్మ జయంతి వేడుకల్లో ఎమ్మెల్యే బండారి

RR: హెచ్‌బీ కాలనీ ఫేజ్‌-1 గ్రౌండ్‌లో విశ్వబ్రాహ్మణ సంఘం కాప్రా సర్కిల్ ఆధ్వర్యంలో విశ్వకర్మ జయంతి వేడుకలు నిర్వహించారు. 20వ యజ్ఞ మహోత్సవంలో ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ప్రజలకు శాంతి, సౌభ్రాతృత్వం, సుఖసంతోషాలు కలగాలని ఆకాంక్షించారు. విశ్వబ్రాహ్మణుల కళలు, వృత్తి నైపుణ్యాలను కొనియాడారు.