హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వైసీపీని వీడి టీడీపీలోకి 50 కుటుంబాలు

VZM: గజపతినగరం మండలం పురిటిపెంట గ్రామానికి చెందిన 50 కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీలో చేరినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. గజపతినగరం టీడీపీ కార్యాలయంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. నియోజకవర్గ అభివృద్ధి, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై పార్టీలో చేరినట్లు వారు తెలిపారు.