హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తీర మండలాలకు ప్రత్యేక అధికారులు: కలెక్టర్

SKLM: జిల్లాకు భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో 11 తీర మండలాలకు ప్రత్యేక అధికారులను కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ నియమించారు. వాటిలో రణస్థలం, ఎచ్చెర్ల, శ్రీకాకుళం, గార, పోలాకి, సంతబొమ్మాళి, వజ్రపుకొత్తూరు, సోంపేట, మందస, కవిటి, ఇచ్చాపురం మండలాలు ఉన్నాయి.  ఈ సందర్భంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సూచించారు.