హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కొవ్వూరులో దళితుల ఆత్మీయ సమ్మేళనం

E.G: కొవ్వూరు లిటరరీ క్లబ్‌లో ఈ నెల 21న కార్యకర్తల సమావేశంతో పాటు దళితుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించనున్నట్లు జై భీమ్ దళిత ప్రజా వేదికరాష్ట్ర అధ్యక్షుడు చోళ్ల రాజు తెలిపారు. సోమవారం జరగనున్న ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చోళ్ల రాజు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి కార్యకర్తలు, దళిత సంఘాల ప్రతినిధులు, ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలన్నారు.