హైదరాబాద్: 28°C
తెలంగాణ

రెబ్బెనలో భారీ వర్షం

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలంలో ఆదివారం భారీ వర్షం కురిసింది. ఆదివారం తెల్లవారుజాము నుండి వాతావరణంలో మార్పులు కనిపించి మధ్యాహ్నం ఒక్కసారిగా భారీ వర్షం కురిసింది. భారీ వర్షం కురవడంతో రైతులు ఆనందం వ్యక్తం చేశారు. భారీ వర్షంతో పంటలకు ఉపయోగపడుతుందని పలువురు రైతులు తెలిపారు. భారీ వర్షంతో ఎక్కడి వారు అక్కడే నిలిచిపోయారు.