NLR: రాపూరు పట్టణంలోని కాపు వీధిలో ఆదివారం కురిసిన వర్షానికి పిడుగుపాటు సంభవించింది. ఈ ఘటనలో ఒక మూడంతస్తుల భవనంపై పిడుగు పడడంతో మూడో అంతస్తు పాక్షికంగా దెబ్బతిన్నది. విద్యుత్ ఉపకరణాలు కూడా కాలిపోవడంతో దాదాపుగా రెండు లక్షల ఆస్తి నష్టం జరిగినట్లు యజమాని తెలిపారు. పిడుగు పడిన సమయంలో భారీ శబ్దం రావడంతో ప్రజలు ఇంటి నుంచి బయటకు పరుగులు తీశారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: ఇంటిపై పడ్డ పిడుగు


