హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

600 ఏళ్ల చరిత్ర కలిగిన ఆంజనేయ ఆలయం

NTR: మైలవరం (M) గణపవరంలోని శ్రీ ఆంజనేయ స్వామి ఆలయానికి 600 ఏళ్ల చరిత్ర ఉంది. విజయనగర సామ్రాజ్య కాలం 15వ శతాబ్దంలో ఇక్కడ ఈ ఆలయం నిర్మితమైనట్లు శాసనాల ద్వారా తెలుస్తోంది. శ్రీకృష్ణదేవరాయల గురువు వ్యాసరాయలు ప్రతిష్ఠించిన హనుమవిగ్రహాల్లో ఇది ఒకటిగా చెబుతారు. ఏకశిల ఆంజనేయ విగ్రహం అభయ ముద్రతో దర్శనమిస్తుంది. గ్రహ దోషాలు, శని ప్రభావం తొలగుతాయని భక్తుల నమ్మకం.