హైదరాబాద్: 28°C
తెలంగాణ

పాలేరు జలాశయానికి 20 అడుగులకు చేరిన నీటిమట్టం..!

KMM: కూసుమంచి మండల పరిధిలోని పాలేరు జలాశయం నీటిమట్టం ఇవాళ ఉదయానికి 20 అడుగులకు చేరుకుంది. ఈ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 23 అడుగులు కాగా, ప్రస్తుతం నాగార్జునసాగర్ ఎడమ కాలువ ద్వారా ఇన్-ఫ్లో నిరంతరాయంగా కొనసాగుతోంది. ప్రస్తుతం రిజర్వాయర్‌లో ఉన్న నీటిని సాగు, తాగునీటి అవసరాలకు వినియోగిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.