హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లాలో పెరిగిన చికెన్ ధరలు..!

పశ్చిమ గోదావరి జిల్లాలో ఆదివారం చికెన్ ధరలు స్వల్పంగా పెరిగాయి. పేరెంట్స్ కోడి కేజీ ధర రూ.280 పలుకుతోంది. గతవారంతో పోలిస్తే  రూ. 20 పెరిగింది. బ్రాయిలర్ స్కిన్‌లెస్ కేజీ రూ.240, స్కిన్‌తో రూ. 220 చొప్పున విక్రయిస్తున్నారు. ఫారం కోడి ధర కేజీ రూ.240 ఉండగా, మార్కెట్లో మటన్ కిలో రూ.1,000 చొప్పున విక్రయాలు సాగిస్తున్నారు.