హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నీలకంఠేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు

SKLM: పాతపట్నంలో వెలసిన శ్రీ నీలకంఠేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం నుంచే భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు స్వామివారికి రుద్రాభిషేకం, బిల్వార్చన, ప్రత్యేక అలంకరణ చేపట్టారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.