హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తిరుపతి లడ్డు ప్రసాదం అంశంపై ప్రత్యేక పూజలు: గోపిరెడ్డి

పల్నాడు: నరసరావుపేట రెడ్డి నగర్ ఆంజనేయ స్వామి దేవాలయంలో తిరుపతి లడ్డు ప్రసాదం అంశంపై వైసీపీ పల్నాడు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం ఉ 11 గంటలకు 101 కొబ్బరికాయలు కొట్టి పూజా కార్యక్రమం నిర్వహించనున్నట్లు పార్టీ కార్యాలయం తెలిపింది. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ వైసీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొనాలని కోరింది.