హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆదోని డివిజన్‌లో 148.8 మి.మీ వర్షపాతం

KNRL: ఆదోని డివిజన్‌లో శనివారం రాత్రి మొత్తం 148.8 మి.మీ వర్షపాతం నమోదైనట్లు ASO వెంకటేశ్వర్లు తెలిపారు. ఎమ్మిగనూరులో అత్యధికంగా 25.4 మి.మీ, ఆదోని-1లో 24.2, నందవరంలో 23.8 మి.మీ వర్షం కురిసింది. మంత్రాలయం 18.4, పెద్దకడబూరు 15.6, గోనెగండ్ల 10.4, ఆదోని-2లో 9.8, కోసిగిలో 8.6, హోళగుందలో 6.4, కౌతాళంలో 6.2 మి.మీ వర్షపాతం నమోదైనట్లు ఇవాళ వెల్లడించారు.