హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తెనాలి డివిజన్‌లో వర్షపాతం వివరాలు..!

గుంటూరు: తెనాలి డివిజన్‌లో ఆదివారం తెల్లవారుజామున పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. డివిజన్ పరిధిలో మొత్తం 85.8 మి.మీ వర్షపాతం నమోదైంది. సగటు వర్షపాతం 10.7 మి.మీగా ఉంది. అత్యధికంగా తెనాలిలో 20.4 మి.మీ, దుగ్గిరాలలో 17.6, చెబ్రోలులో 16.4, కాకుమానులో 13.4, పొన్నూరులో 8.6, కొల్లిపరలో 7.6, మంగళగిరిలో 1.8 మి.మీ వర్షపాతం నమోదైంది. తాడేపల్లిలో వర్షపాతం నమోదు కాలేదు.