హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జడ్పీ ప్రత్యేక అధికారిగా కలెక్టర్

SKLM: జిల్లా పరిషత్ పాలకవర్గం పదవీకాలం ఈనెల 24తో ముగియనున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక అధికారిని నియమించింది. జడ్పీ ప్రత్యేక అధికారిగా జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్‌ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈనెల 25 నుంచి ఆరు నెలల పాటు లేదా కొత్త పాలకవర్గం ఎన్నికై బాధ్యతలు చేపట్టే వరకు కలెక్టర్ ప్రత్యేక అధికారిగా కొనసాగనున్నారు.