CTR: పలమనేరు సమీపంలోని బైరెడ్డిపల్లి మండలం కడపనత్తం గ్రామంలో రైతు గజేంద్ర తోటలోకి ఏనుగు తరచూ ప్రవేశించి బొప్పాయి పంటను ధ్వంసం చేస్తోంది. రైతు నిద్రించిన తర్వాత తోటలోకి వచ్చి చెట్లను విరగ్గొట్టి పక్వానికి వచ్చిన కాయలను తిని వెళ్లిపోతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు. గతంలోనూ పలుమార్లు ఇదే ఏనుగు పంటను నాశనం చేసినట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
బొప్పాయి తోటలో ఏనుగు బీభత్సం


