హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రేపు డీ-ఫార్మసీ స్పాట్ అడ్మిషన్లు

KRNL: బి.తాండ్రపాడులోని ఎస్ జీపీఆర్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో రేపు డీ-ఫార్మసీ స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు ఇన్‌చార్జి ప్రిన్సిపల్ రామ్ ప్రసాద్ తెలిపారు. ఎంపీసీ, బైపీసీ ఉత్తీర్ణులైన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అడ్మిషన్లకు హాజరయ్యే విద్యార్థులు ఒరిజినల్ ధ్రువీకరణ పత్రాలు వెంట తీసుకురావాలని తెలిపారు.