హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

21 నుంచి జిల్లాలో భారీ వర్షాలు!

GNTR: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ సెప్టెంబర్‌ 21న వాయుగుండంగా, 22న తీవ్ర వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో సెప్టెంబర్‌ 21 నుంచి 23 వరకు బాపట్ల, గుంటూరు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.