ASR: గంజాయి సాగు అరికట్టడమే లక్ష్యంగా ముంచంగిపుట్టు మండలంలోని మారుమూల గ్రామాలు, కొండ ప్రాంతాల్లో పోలీసులు డ్రోన్ కెమెరాలతో విస్తృత గగనతల నిఘా చేపట్టారు. ఎస్సై పీ.నాని నేతృత్వంలో శనివారం పోలీస్, సీఏపీ బలగాలు, డ్రోన్ తనిఖీలు నిర్వహించారు. ఎలాంటి గంజాయి తోటలు గుర్తించలేదన్నారు. ఎవరైనా గంజాయి అక్రమ సాగు, రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్
'మండలంలో విస్తృత గగనతల నిఘా'


