AKP: పింఛన్ల నిబంధనలు మార్చాలని అనకాపల్లి జిల్లా ప్రజలు కోరుతున్నారు. సదరం పత్రాలపై 'టెంపరరీ' అని ఉండటం, చనిపోయిన ఉద్యోగుల పేర్లు హౌస్‌హోల్డింగ్‌లో తొలగించకపోవడంతో దరఖాస్తు చేయలేకపోతున్నామని వాపోయారు. ఆధార్‌లో వయసు తక్కువగా ఉండటం, 300 యూనిట్ల విద్యుత్ వాడకం పేరిట తిరస్కరిస్తున్నారని తెలిపారు. సాంకేతిక సమస్యలు సరిచేసి తమకు న్యాయం చేయాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
'పింఛన్ నిబంధనలు మార్చాలి'


