బాపట్ల: వినాయక నిమజ్జనంలో విషాదం చోటుచేసుకుంది. పుల్లలచెరువులో శనివారం అర్ధరాత్రి చెరువులోకి దిగిన ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు నీటిలో మునిగి మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల మేరకు అంజన్నపురం కాలనీకి చెందిన గుమ్ము గాలెయ్య (35) వినాయక నిమజ్జన కార్యక్రమంలో భాగంగా కాటివీరన్న చెరువు వద్దకు వెళ్లారు. నిమజ్జనం కోసం చెరువులోకి దిగి లోతు గుంతలో చిక్కుకుని మృతి చెందాడు.
ఆంధ్రప్రదేశ్
వినాయక నిమజ్జనంలో విషాదం.. నీటిలో మునిగి వ్యక్తి మృతి


