హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కూతురి పెళ్లి.. అంతలోనే విషాదం

W.G: తాడేపల్లిగూడెం మండలం ఎల్. అగ్రహారం టిడ్కో ఇళ్ల సముదాయానికి చెందిన కాకర్లమూడి ఏసు (48) శనివారం వినాయక చవితి ఊరేగింపులో సౌండ్ బాక్స్ ముందు డాన్స్ చేస్తూ కుప్పకూలి మృతిచెందారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. వచ్చే నెలలోనే కుమార్తె వివాహం జరగాల్సి ఉండగా తండ్రి ప్రాణాలు కోల్పోవడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి.