ASR: జీ.మాడుగుల మండలం బంధవీధిని శనివారం కలెక్టర్ నిశాంతి సందర్శించారు. ఈ సందర్భంగా గ్రామస్థులతో మమేకమై సమస్యలు తెలుసుకున్నారు. తాగునీటి సమస్యపై ఆరా తీసి, పరిష్కారానికి రూ.16లక్షలు మంజూరైనట్లు తెలిపారు. వెంటనే టెండర్లు పిలిచి పనులు ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. డ్రైనేజీ సమస్య పరిష్కారానికి మ్యాజిక్ డ్రెయిన్స్ పథకం ద్వారా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
సమస్యలపై జిల్లా కలెక్టర్ తక్షణ చర్యలు


