హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఇంటి పై పడ్డ పిడుగు.. యువకుడికి గాయాలు

కోనసీమ: అమలాపురం పట్టణం మహిపాల వీధిలోని ఎం.ఎస్.ఎన్ మూర్తి ఇంటిపై ఆదివారం పిడుగు పడింది.ఈ ప్రమాదంలో ఇంట్లో ఉన్న యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి అతడిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు.పిడుగుపాటు ధాటికి ఇంట్లోని కిటికీల అద్దాలు, సామగ్రి ధ్వంసమయ్యాయి.