హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఈనెల 23న జాబ్ మేళా

NLR: ఆత్మకూరు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఈనెల 23వ తేదీన APSSDC ఆధ్వర్యంలో జాబ్ మేళా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ నాగేశ్వరరావు ఆదివారం ఒక ప్రకటన ద్వారా పేర్కొన్నారు. ఈ జాబ్ మేళాకు 15 ప్రముఖ కంపెనీలు పాల్గొననున్నట్లు తెలిపారు. పది, ఇంటర్, డిగ్రీ, డిప్లమో, బీటెక్, పీజీ చదివిన విద్యార్థులు అర్హులని తెలియజేశారు.