కృష్ణా: తోట్లవల్లూరు (M) పెనమకూరులో విషాదం జరిగింది. కుటుంబ కలహంతో ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన వాణి (38) ఇంట్లో దాచిన డబ్బుతో మద్యం సేవించడంతో భర్త సోనీ మందలించాడు. ఈ విషయమై ఇద్దరి మధ్య స్వల్ప వాగ్వాదం జరిగింది. అనంతరం భర్త బయటకు వెళ్లిన సమయంలో వాణి ఇంటి వరండాలో ఉరివేసుకుని మృతి చెందింది.
ఆంధ్రప్రదేశ్
భర్తతో గొడవ.. వివాహిత ఆత్మహత్య


