నంద్యాల జిల్లాలో SIR ప్రక్రియను వేగంగా పూర్తి చేసి అక్టోబర్ 9న తుది ఓటర్ల జాబితా ప్రచురించేందుకు చర్యలు చేపట్టినట్లు కలెక్టర్ జి. రాజకుమారి శనివారం తెలిపారు. సుమారు 6 లక్షల ఓటర్ల డేటా మ్యాపింగ్ పూర్తయిందన్నారు. 80,283 నోటీసులపై విచారణ పూర్తికాగా, 11,45,665 మంది ఓటర్ల వివరాలు తుది ప్రచురణకు సిద్ధంగా ఉన్నాయని కలెక్టర్ వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్
ఓటర్ల వివరాల పరిశీలనకు ప్రత్యేక చర్యలు: కలెక్టర్


