హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ప్రతి ఒక్కరూ పరిశుభ్రతను పాటించాలి'

శ్రీకాకుళం ఉమెన్స్ కళాశాలలో నిర్వహించిన స్వరాంధ్ర స్వచ్చాంధ్ర కార్యక్రమంలో కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులతో స్వరాంధ్ర స్వచ్చాంధ్ర ప్రతిజ్ఞను చేయించారు. అలాగే, ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పరిశుభ్రతను పాటించాలని పిలుపునిచ్చారు. కేంద్ర మంత్రి స్వయంగా జేసీబీ ఎక్కి.. చెత్తను తొలగించారు.