హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పెద్దాపురం సబ్ జైలులో జిల్లా న్యాయమూర్తి ప్రత్యేక తనిఖీలు

KKD: పెద్దాపురం సబ్ జైలును ఏడవ జిల్లా న్యాయమూర్తి సరస్వతి, RDO కృష్ణమూర్తి బోర్డు సభ్యులతో కలిసి శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి ఖైదీలతో మాట్లాడి వారి యోగక్షేమాలు, ఆహార వసతులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం DSP తిలక్, DEO ప్రభాకర్ శర్మ, EE శేషగిరిరావు, జైలు సూపరింటెండెంట్ రమణ బాబు జైలు వివరాలను వారికి వివరించారు.