హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విద్యుత్ షాక్‌తో మహిళ మృతి

KKD: తొండంగి మండలంలోని బెండపూడిలో శనివారం విషాద ఘటన చోటుచేసుకుంది. బట్టలు ఉతికిన అనంతరం తడి చేతులతో స్విచ్ ఆఫ్ చేస్తుండగా విద్యుత్ షాక్‌కు గురై జ్యోతి (32) అక్కడికక్కడే మృతి చెందినట్లు ఎస్సై జగన్మోహన్ తెలిపారు. మృతురాలికి భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నట్లు చెప్పారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వెల్లడించారు.