హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రూ.3.01 లక్షలకు గణపతి లడ్డూ వేలం

అన్నమయ్య: రాజంపేట పట్టణ పరిధిలోని నారపరెడ్డిపల్లిలో వినాయక చవితి వేడుకలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శనివారం నిర్వహించిన గణపతి లడ్డూ వేలం పాట ఉత్సాహంగా సాగింది. గ్రామానికి చెందిన పిండిబోయిన రాజశేఖర్ రూ.3.01 లక్షలకు లడ్డూను దక్కించుకున్నారు. అనంతరం మేళతాళాల నడుమ ఉత్సవ కమిటీ సభ్యులు రాజశేఖర్‌ను ఊరేగింపుగా ఆయన ఇంటికి తీసుకెళ్లారు.