హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సామాజిక సేవలకు శరత్‌కుమార్ రాజుకు డాక్టరేట్

అన్నమయ్య: రాజంపేటకు చెందిన వాకర్స్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ మ్యాగజైన్ ఎడిటర్ కొండూరు శరత్‌కుమార్ రాజుకు న్యాయ, సాహిత్య, సామాజిక సేవలకు గుర్తింపుగా డాక్టరేట్ లభించింది. శనివారం న్యూఢిల్లీలోని నేషనల్ సైన్స్ మ్యూజియం ఆడిటోరియంలో జరిగిన జాతీయ సదస్సులో ఈ పురస్కారాన్ని అందజేశారు. సాహిత్యం, విద్య, సామాజిక సేవలు, పర్యావరణ పరిరక్షణలో సేవలను గుర్తించి ఆయనను ఎంపిక చేశారు.