హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లాలో ఎన్నికలకు 1,989 పోలింగ్ కేంద్రాలు

SKLM: జిల్లాలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి తుది పోలింగ్ కేంద్రాల జాబితాను జడ్పీ సీఈవో ఆర్. వెంకట్రామన్ శనివారం విడుదల చేసినట్లు ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని 30 మండలాల పరిధిలో మొత్తం 16,08,673 మంది ఓటర్లు ఉండగా, ఎన్నికల నిర్వహణకు 1,989 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు.