హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

RTC డిపోలో తనిఖీలు

కోనసీమ: రాజోలు RTC డిపోను జోన్-2 ఈడీ విజయరత్నం శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. గ్యారేజీ, కార్గో సేవలు, RTC-IOCL పెట్రోల్ బంకును పరిశీలించిన ఆయన, తాగునీరు, టాయిలెట్ల పరిశుభ్రతపై సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రయాణికుల భద్రతకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని, డ్రైవర్లు, కండక్టర్లు ప్రయాణికులతో మర్యాదగా మాట్లాడాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ సిబ్బంది పాల్గొన్నారు.