హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పింఛన్ దరఖాస్తుల పరిశీలన

AKP: జిల్లాలో 44,882 పింఛన్ దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఇందులో వృద్ధాప్య 22,276, వితంతు 8,955, దివ్యాంగులవి 7,200 ఉన్నాయి. మత్స్యకార, చేనేత, ఒంటరి మహిళలు సహా ఇతర కేటగిరీల వారు దరఖాస్తు చేసుకున్నారు. క్షేత్రస్థాయి పరిశీలన పూర్తి చేసి, అర్హులైన వారందరికీ వచ్చే నెల 1న పింఛన్లు అందిస్తామని అధికారులు స్పష్టం చేశారు.