హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నవధాన్యాల సాగువల్ల అధిక దిగుబడులు

KDP: లింగాల (M) అంకెవానిపల్లి గ్రామానికి చెందిన రైతు గోపాల్రెడ్డి తన 10 ఎకరాల చీనీ తోటలో అంతర పంటగా 25 రకాల నవధాన్యాలను ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో సాగు చేశారు. శనివారం EPMDS పొలాన్ని JDA సుబ్రహ్మణ్యేశ్వరరావు, DPM ప్రవీణ్‌కుమార్, ఏవో రమేష్ పరిశీలించారు. నవధాన్యాలను అంతర పంటలుగా సాగు చేయడం వల్ల భూమిలో పోషకాలు పెరిగి, నేల సారవంతం అవుతుందని అధికారులు తెలిపారు.