పల్నాడు: చిలకలూరిపేటలో శనివారం రాత్రి వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో మాజీ మంత్రి విడదల రజిని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. 48 వార్డుల్లో ఎన్నికలకు సమష్టిగా సిద్ధం కావాలని, పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. ప్రజల్లోకి వెళ్లి వారి సమస్యలను తెలుసుకోవాలని, ప్రజలకు చేసిన మేలే పార్టీకి బలమని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
స్థానిక ఎన్నికలకు వైసీపీ శ్రేణులు సిద్ధం కావాలి: మాజీ మంత్రి


