హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పోలింగ్ కేంద్రాల జాబితాకు కలెక్టర్ల ఆమోదం

ATP: జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ కేంద్రాల తుది జాబితాకు అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల కలెక్టర్లు ఆమోదముద్ర వేశారు. అనంతపురం జిల్లాలో ఈసారి 1,594, శ్రీసత్యసాయి జిల్లాలో 1,320 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఓటర్ల సంఖ్య పెరగడంతో రెండు జిల్లాల్లో పోలింగ్ కేంద్రాల సంఖ్య పెరిగింది. జాబితాను మండల పరిషత్ కార్యాలయాల్లో ప్రదర్శించారు.