హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

షార్ట్‌ఫిలిం పోటీలకు దరఖాస్తుల ఆహ్వానం

ATP: లింగనిర్ధారణ నిషేధిత చట్టంపై అవగాహన కల్పించేందుకు షార్ట్‌ఫిలిం పోటీలు నిర్వహిస్తున్నట్లు DMHO వెంకటేశ్వర్లు తెలిపారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు ఈ నెలాఖరులోపు వీడియోలను జిల్లా వైద్యఆరోగ్యశాఖ కార్యాలయంలో అందజేయాలి. ఉత్తమ షార్ట్‌ఫిలింలకు కలెక్టర్ ఆనంద్ చేతుల మీదగా రూ.30 వేలు, రూ.20 వేలు, రూ.10 వేల నగదు బహుమతులు అందజేస్తారు.