హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గండికోటలో పెరుగుతున్న నీటి నిల్వ

KDP: నంద్యాల జిల్లా అవుకు జలాశయం నుంచి గండికోటకు 2,500 క్యూసెక్కుల నీరు చేరుతోందని జల వనరుల శాఖ ఈఈ ఉమామహేశ్వర్లు తెలిపారు. గండికోట పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 26.85 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 15 టీఎంసీల నీరు నిల్వ ఉంది. తాగునీటి అవసరాల కోసం కొండాపురం, ముద్దనూరు, తాడిపత్రి ప్రాంతాలకు 20 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు.