హైదరాబాద్: 28°C
క్రీడలు

ఆసియా గేమ్స్ వేళ టీమిండియాకు కిట్ టెన్షన్

ఆసియా గేమ్స్ కోసం టీమిండియా బయల్దేరనున్న తరుణంలో ఆటగాళ్ల జెర్సీలు, కిట్ల సైజు విషయంలో సమస్య తలెత్తింది. జపాన్‌తో మ్యాచ్‌కు స్టాండర్డ్ కిట్ వాడనుండగా, ఆ తర్వాత అధికారిక జెర్సీ ధరించాల్సి ఉంది. ఈ ఇబ్బందిని పరిష్కరించేందుకు బీసీసీఐ రంగంలోకి దిగి ఐఓఏ కిట్ పార్టనర్‌తో చర్చలు జరిపింది. సరిచేసిన కిట్లు త్వరలోనే అందుతాయని అధికారులు తెలిపారు.