హైదరాబాద్: 28°C
క్రీడలు

సెలక్షన్ కమిటీ ఛైర్మన్‌ రేసులో రమేష్ పవార్

బీసీసీఐ జూనియర్ నేషనల్ సెలక్షన్ కమిటీ ఛైర్మన్ రేసులో మాజీ క్రికెటర్ రమేష్ పవార్ ముందు వరుసలో ఉన్నారు. భారత్ తరఫున ఆడిన అనుభవంతో పాటు, మహిళా జట్టుకు కోచ్‌గా, NCAలో యువ ఆటగాళ్లను తీర్చిదిద్దిన అనుభవం ఆయనకు ఉంది. జూనియర్ల నుంచి ప్రతిభను వెలికితీసేందుకు ఈ అనుభవం ఉపయోగపడుతుందని బోర్డు భావిస్తోంది. త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.