VSP: తిమ్మాపురంలో ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్‌కు 5 ఎకరాల భూమి కేటాయింపు ప్రక్రియను వేగవంతం చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు, పల్లా శ్రీనివాసరావు, పి.విష్ణుకుమార్ రాజు ఆయనకు శనివారం వినతిపత్రం ఇచ్చారు. గతంలో సాంకేతిక కారణాల వల్ల ఆగిపోయిన ఈ ప్రతిపాదనపై తగిన చర్యలు తీసుకోవాలని కార్యదర్శి ప్రద్యుమ్నకు సీఎం సూచించారు.
ఆంధ్రప్రదేశ్
ఫిల్మ్ నగర్ భూ కేటాయింపుకు సీఎం హామీ


