AP: విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొందరు నకిలీ టికెట్ల విక్రయాలకు పాల్పడుతున్నాయి. ఓ మహిళా భక్తురాలు దళారుల వద్ద రూ.3,500 విలువైన శ్రీచక్రార్చన సేవ టికెట్ కొనుగోలు చేయగా, అది నకిలీదని ఆలయ ఐటీ సిబ్బంది నిర్ధారించారు. దీంతో తాను మోసపోయానని బాధితురాలు అధికారులకు ఫిర్యాదు చేయడంతో, ఈ నకిలీ దందా వెలుగులోకి వచ్చింది. ఆలయ వర్గాలు దీనిపై విచారణ చేపట్టాయి.
భక్తి
ఇంద్రకీలాద్రి వద్ద నకిలీ టికెట్ల కలకలం


