తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. ఇవాళ మోహినీ అవతారంలో మలయప్పస్వామి దర్శనమిచ్చారు. రాత్రికి గరుడ వాహనంపై స్వామివారు దర్శనమివ్వనున్నారు. గరుడ వాహనసేవకు భారీగా భక్తులు తరలివస్తున్నారు. దీంతో మాడ వీధులు భక్తులతో కిక్కిరిసిపోతున్నాయి. నాలుగు మాడ వీధుల్లో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. సాయంత్రం నుంచి తిరుమలకు టూవీలర్స్ నిలిపివేస్తున్నారు.
భక్తి
మోహినీ అవతారంలో మలయప్పస్వామి


